పట్టుదలకు ప్రతీక..
నకిరేకల్ : తాటి గీతకు చిన్నప్పటి నుంచి నటన అంటే ప్రాణం. ఇంటర్ పూర్తికాగానే తల్లిదండ్రులు గీతకు పెళ్లి చేశారు. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. భర్త సైదులు దివ్యాంగుడు. పేద కుటుంబం కావడంతో భర్త సహాయంతో నకిరేకల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా తోపుడు బండిపై నిత్యం ఇడ్లీలు, టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే గీత ఓపెన్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. కళలు, నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న గీత ఎన్నోసార్లు జిల్లాస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు సాధించింది. అంతేకాకుండా ఇళ్లలో వాడి పడేసిన నిరుపయోగ వస్తువులతో అందమైన కళాకృతులను చేయడం హాబీగా మార్చుకుంది.
టీవీ సీరియల్స్, సినిమాల్లో కూడా..
గత ఆరేళ్లుగా ఎంతో కష్టపడిన గీత ఈ టీవీలో ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో, మరొక టీవీ నిర్వహించిన బీ ఏ స్టార్ కార్యక్రమంలో తొలిసారి బుల్లితెరపై కనిపించారు. అంతేకాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్‌లో డాక్టర్‌గా, నాలుగు స్తంభాలాట సీరియల్‌లో గృహిణిగా, బమ్‌చిక్ బమ్‌లో అత్త పాత్రలో, మా టీవీలో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్‌లో కళాశాల ప్రిన్సిపాల్‌గా, గృహప్రవేశం సీరియల్‌లో ధనవంతురాలైన గృహిణి పాత్రలో, జీ టీవీలో వచ్చే నిన్నే పెళ్లాడుతా సీరియల్‌లోనూ నటించింది. గీత నటి ంచిన నేతన్న పాటను యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షించారు. చదువెందుకు అబ్బినది, కేసీఆర్ కథాగానం, నందనం, శిఖరం, శానాబాగుంది వంటి యూట్యూబ్ పాటల్లోనూ గీత నటించారు. అదేవిధంగా తమాసోమా జ్యోతిర్గమయ సినిమాలో, వరుణ్ సందేశ్ నటించిన యాద్బావం తద్బవతి సినిమాలో తల్లి పాత్రలో నటించింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ పక్కన ఓ క్యారెక్టర్‌లో నటించింది. గాడ్, లగ్గం, ప్రేమ విమానం, గేమ్ ఛేంజర్, మహర్షి, భగవంత్ కేసరి, ఘాటీ, భీమదేవరపల్లి బ్రాంచి, ట్రెండింగ్ లవ్, పైలం పిల్లగా, అట్లాస్ సైకిల్, కాటి తదితర సినిమాలతో పాటు 5 యూట్యూబ్ సాంగ్స్, 20 షార్ట్ ఫిల్మ్స్, 10 డెమో ఫిల్మ్స్, 4 ఫీచర్ ఫిల్మ్స్, 3 ఇండిపెండెంట్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.
నా ప్రత్యేకత ఏంటో చూపిస్తున్నా
తోపుడు బండిపై ఇడ్లీలు అమ్ముకునే నన్ను చాలామంది చుల కనగా చిన్నచూపుతో చూశారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. నటనపై ఉన్న ఆసక్తితో ఎలాగైనా సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని 12ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను. ఇప్పడు నా ప్రత్యేకత ఎంటో చూపిస్తున్నా. మహిళలను చిన్నచూపు చూడకుండా, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే సత్తా చాటుతారని చాటి చెప్పడమే నా లక్ష్యం. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ధ్యేయంతో కృషిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగల్గుతారు. – తాటి గీత
సినిమా అనే రంగుల ప్రపంచం చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎంతో మంది తమను తాము వెండితెరపై చూసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొందరికే సక్సెస్ లభిస్తుంది. సినిమాల్లో రాణించాలంటే
టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన తాటి గీత కూడా కుటుంబ పోషణ కోసం
ఇడ్లీ బండి నడుపుతూనే.. వెండితెరపై నటించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె కనిపించింది.
బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్న
నకిరేకల్‌కు చెందిన మహిళ
కుటుంబ పోషణ కోసం
ఇడ్లీ బండి నడిపిస్తూ..
పలు సినిమాలు, సీరియల్స్‌లో
నటించడంతో మంచి గుర్తింపు
పట్టుదలకు ప్రతీక..
పట్టుదలకు ప్రతీక..
పట్టుదలకు ప్రతీక..
పట్టుదలకు ప్రతీక..
పట్టుదలకు ప్రతీక..


