జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్ : జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం కొత్తగా జారీచేసిన 252 జీఓలోని నిబంధనలను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే (హెచ్–143), డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన 252 జీఓ వల్ల జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను వేరు చేసే ఆలోచన సరికాదన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా 252 జీఓను సవరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. కార్యక్రమంలో యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్, మట్టయ్య, దుర్గాప్రసాద్, జనార్దన్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వరుణమ్మ, పగడాల సురేష్, వెంకట్‌రెడ్డి, గాదె రమేష్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్, నరేష్, జాకీర్‌అలీ, కత్తుల గిరిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


