నాలుగు ఎకరాల్లో సాగు
ప్రయోగాత్మకంగా మొదటగా నాలుగు ఎకరాల్లో వక్కసాగు చేస్తున్నా. అంతరపంటగా అల్లనేరేడు, మధ్యలో వక్క మొక్కలు నాటాను. ప్రస్తుతం నాలుగో ఏడాది కావడంతో ఈసారి వక్క మొక్కలు దిగుబడి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు క్షేత్ర పర్యటనల ద్వారా వక్క సాగు లాభదాయకమని తెలుసుకుని సాగు చేస్తున్నా.
– మద్ది మాధవరెడ్డి, కాచారం
రైతులకు మొక్కలు సరఫరా చేస్తున్నా
వక్క మొక్కలు సాగు చేయడంతోపాటు కేరళ నుంచి వక్క మొక్కలు తెప్పించి రైతులకు సరఫరా చేస్తున్నా. ఇప్పటి వరకు 22వేల మొక్కలు సరఫరా చేశా. తమిళనాడులోని శివమొగ్గ ప్రాంతంతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సాగు చేస్తున్న వక్క తోటలను పరిశీలించి అధ్యయనం చేశా. పండ్లతోటల్లో దీర్ఘకాలిక పంటలైన శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేసిన అనుభవాలతో వక్క సాగు కూడా లాభదాయకమేనని గ్రహించి సాగు చేస్తున్నా.
– పాల్వాయి జలంధర్‌రెడ్డి, పిట్టలగూడెం
నాలుగు ఎకరాల్లో సాగు


