మిడతనపల్లిలో విషాద ఛాయలు
ఆత్మకూర్ (ఎస్), గుంటూరు రూరల్ : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఆత్మకూర్(ఎస్) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన దంపతులు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కంచనపల్లి వెంకయ్య(70), సుశీల (64) దంపతులు. వీరి కుమారుడు మధు హైదరాబాద్‌లో కొంతకాలంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సుశీలకు అనా రోగ్యంగా ఉండడంతో వారిద్దరూ కుమారుడి వద్దే ఉంటున్నారు. సుశీల ఆరోగ్యం మెరుగుపడాలని తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో ఈ నెల 23న వారి కుమారుడు మధు, కోడలు మనీషా, మనవళ్లు జ్ఞానేశ్వర, చరణ్, వర్షిత్‌లతో కలిసి తమ సమీప బంధువు మద్దిరాల మండలం మావిళ్లమడవ గ్రామానికి చెందిన మహేష్‌తో వెళ్లారు. దర్శనం అనంతరం గురువారం సాయంత్రం తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో కారును కాసేపు ఆపారు. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరి కారును వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సుశీల, వెంకయ్య, మహేష్ అక్కడికక్కడే మృతిచెందారు. మధు, మనీష, చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి, మృతదేహాలకు గుంటూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మిడతనపల్లికి తరలించారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
తిరుపతికి వెళ్లి వస్తుండగా ఘటన
మిడతనపల్లిలో విషాద ఛాయలు
మిడతనపల్లిలో విషాద ఛాయలు


