బుద్ధవనంలో మద్రాస్ హైకోర్టు జడ్జి
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలను శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దండపాణి కుటుంబ సమేతంగా సాగర్‌కు రాగా వారికి రెవెన్యూ ప్రొటోకాల్ అధికారి దంగ శ్రీనివాసరెడ్డి, సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య, నిడమనూరు కోర్టు ప్రొటోకాల్‌సిబ్బంది మహేందర్‌రెడ్డి, ఖాలిక్‌లు స్వాగతం పలికారు. వారు సాగర్‌డ్యాంతో పాటు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి శిల్పకల, ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాధించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే కోర్టు న్యాయమూర్తి రమాదేవి, నల్లగొండ జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్‌కుమార్‌లు కుటుంబ సమేతంగా బుద్ధవనాన్ని సందర్శించారు.వీరికి స్థానిక గైడ్ సత్యనారాయణ సాగర్ చరిత్రతో పాటు బుద్ధవనం విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు అతిథులను కండువాలు కప్పి, బ్రోచర్లు అందించి సత్కరించారు. ధ్యానమందిరంలో బుద్ధజ్యోతిని వెలిగించారు. సమావేశ మందిరంలో బుద్ధవనంపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం సందర్శనకు వచ్చిన ప్రముఖులు తమకు ఆధ్యాత్మిక శాంతిని, మధురానుభూతిని కలిగించిందని అభిప్రాయపడ్డారు.


