ఆర్‌ఎంపీల సేవలు వెలకట్టలేనివి
నల్లగొండ టౌన్ : గ్రామీణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్ల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని అద్దంకి బైపాస్‌లో గల సుశృత గ్రామీణ వైద్యుల (ఫస్ట్ ఎయిడ్) సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌ఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు అందజేసి ప్రభుత్వం చేసే ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేఽశారని గుర్తుచేశారు. ఆర్‌ఎంపీల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు గ్రామీణ వైద్యులు పట్టణంలోని ప్రకాశం బజార్ నుంచి బైపాస్‌లోని సంఘం కార్యాలయంలో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎ. కృష్ణారెడ్డి, రాజశేఖర్‌రావు, వెంకన్నగౌడ్, దశరథ, వనం యాదగిరి, ప్రశాంత్, లక్ష్మణాచారి, మునీర్, హుసేన్, లక్ష్మయ్యగౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


