కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సీఎంకు లేదు
సూర్యాపేటటౌన్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గల్లీ స్థాయి నాయకుడే అని మళ్లీ రుజువైందన్నారు. కేసీఆర్ అడిగినదానికి సమాధానం చెప్పలేకనే విషం కక్కుతున్నాడని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారన్నారు. మంచి పనులు చేసి మంచి మాటలతో ప్రజా హృదయాలను గెలవాలని, సీఎం మాటలు విని కాంగ్రెస్ పార్టీ సర్పంచులే సిగ్గుపడుతున్నారని అన్నారు. కేసీఆర్ సభలు పెడితే కాంగ్రెస్ అరాచకాలు ఎక్కడ బయటపడతాయో అని సీఎం భయపడుతున్నాడని, సాధారణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రేవంత్‌రెడ్డిని రాజకీయంగా ప్రజలే బండరాళ్లకు కట్టి మూసీలో పడేస్తారని విమర్శించారు. కేసిఆర్ ఏం మాట్లాడిండో కోట్లాది మంది ప్రజలు చూశారని, ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు తప్ప.. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు మోదీ ద్రోహం చేస్తున్నారన్నా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మౌనంగా కూర్చోలేమని, ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసీఆర్ పైన ఉందన్నారు. తెలంగాణ తెచ్చిన వాళ్లముగా.. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినా తమ పైనే ఎదురుదాడికి దిగితున్నారన్నారు. ఇట్లనే ఉంటే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రజలకు నీటి సమస్యలు తలెత్తుతాయని, వీటిపై కాంగ్రెస్ మంత్రులకు కూడా సరైన అవగాహన లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజా ఉద్యమం తప్పక మొదలుపెడతామన్నారు.
ఫ ముఖ్యమంత్రి హోదాను
మరింత దిగజార్చుతున్నావ్..
ఫ మాజీ మంత్రి, సూర్యాపేట
ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


