రేషన్ డీలర్ల నియామకమేదీ?
సమయం కుదిరినప్పుడే..
ఆత్మకూరు(ఎం): జిల్లాలో రేషన్ డీలర్ పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచడం లేదు. పక్క గ్రామాలకు డీలర్లకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో సకాలంలో షాపులు తీయలేకపోతున్నారు. దీంతో సరుకుల కోసం కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాఓని 428 గ్రామ పంచాయతీల్లో 515 రేషన్ షాప్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 2,48, 596 రేషన్ కార్డులకు 7,82,458 యూనిట్లు ఉన్నాయి. 4.957 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటారు. ప్రస్తుతం 94 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి 2023 మే11న నోటిఫికేషన్ వేశారు. కానీ, నేటికీ భర్తీ చేయలేదు. 94 రేషన్ షాపుల బాధ్యతలను పక్క గ్రామాల డీలర్లు చూస్తున్నారు.
ప్రతి నెలా 1నుంచి 18వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంటారు. అయితే ఇంచార్జి డీలర్లు తమకు వీలున్నప్పుడు మాత్రమే గ్రామానికి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారని, దీంతో రేషన్ షాపులకు తిరిగివెళాల్సిన పరిస్థితి ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 94 పోస్టులు ఖాళీ
ఫ పక్క గ్రామాల డీలర్లకు బాధ్యతలు
ఫ వీలున్నప్పుడే దుకాణాలు ఓపెన్
ఫ సకాలంలో బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు


