వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం
భువనగిరి : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయి జయంతిని గురువారం భువనగిరిలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మాజీ జిల్లా అధ్య క్షుడు పాశం భాస్కర్, నాయకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్‌పేయి సేవలను స్మరించుకున్నారు. వాజ్‌పేయి అడుగుజాడల్లో నడవాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, పట్నం శ్రీనివాస్, శ్యాంసుందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి,అచ్చయ్య, మాదురి, మల్లారెడ్డి, వైజయంతి, కోటేష్, రత్నపురం బలరాం,మాయ దశరథ, డీఎల్‌ఎన్ గౌడ్, జనగాం నర్సింహాచారి, నల్లమాస వెంకటేశ్వర్లు, భిక్షపతి, మహమూద్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.


