రుణాలు మాఫీ చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
భూదాన్‌పోచంపల్లి: చేనేత రుణాలు మాఫీ చేయకపోతే వారం రోజుల్లో సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో బుధవారం సాయంత్రం పోచంపల్లికి చేరుకున్నారు. స్థానిక ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవరణలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాపునర్వీ హ్యండ్లూమ్ యూనిట్‌ను సందర్శించారు. ఆమె వెంట పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, భూషన్, హరిశంకర్, హేమలత తదితరులున్నారు.


