యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్‌ అందజేత

Dec 25 2025 10:19 AM | Updated on Dec 25 2025 10:19 AM

యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్‌ అందజేత

యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్‌ అందజేత

యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్‌రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్‌మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనానికి ఆలయాధికారులు, దాతలు సుభాషిని, వెంకట్‌రాంరెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ బ్యాటరీ వాహనాన్ని వినియోగించాలని దాత ఆలయాధికారులను కోరారు. అనంతరం వారు యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

వెండి ఆరాధన పాత్రలు బహూకరణ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన బూస కృష్ణ, కుటుంబ సభ్యులు వెండి ఆరాధన పాత్రలను బహూకరించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రూ.2.50లక్షలు (2 కిలోల 106 గ్రాములు) విలువ చేసే 5 పాత్రలతో పాటు ఒక ప్లేట్‌ను ఆలయ అర్చకులు, అధికారులకు అందజేశారు. అంతకుముందు బూస కృష్ణ, కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు.

మద్యం మత్తులో ఏఎన్‌ఎంపై సీహెచ్‌ఓ దాడి

సీహెచ్‌ఓను సస్పెండ్‌ చేసిన డీఎంహెచ్‌ఓ

చివ్వెంల(సూర్యాపేట) : మద్యం మత్తులో ఏఎన్‌ఎంపై సీహెచ్‌ఓ దాడి చేశాడు. ఈ ఘటన చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకటేశ్వర్లు జి.తిర్మలగిరి గ్రామంలోని సబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం పట్ల మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. కొంతమంది స్థానికులు గమనించి ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్‌ కావడంతో మండల వైద్యాధికారి జి. భవాని జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో సీహెచ్‌ఓ ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ జిల్లా వైద్యాధికారి పెండెం వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement