మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
యాదగిరిగుట్ట : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా కాంగ్రెస్ మంత్రులే 40 టీఎంసీలు చాలు అని లేఖలు రాయడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం కొండపైన హరిత టూరిజం హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీటి ప్రాజెక్టులు తీసుకువస్తే.. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తగ్గించి, రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందన్నారు. యాదగిరి దేవస్థానం నుంచి ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు పెట్టవద్దని నోటీసులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇష్టానుసారంగా జెండాలు, ఫ్లెక్సీలు పెట్టి నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ప్లెక్సీలు ఏర్పాటును వ్యతిరేకించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు అక్రమంగా తీసుకెళ్లారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ పెరిగిందని, అందుకే సర్పంచ్‌లుగా అధిక సీట్లు గెలిపించారన్నారు. కేసీఆర్ అద్భుతమైన పాలనతో పరిపాలన చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఫ మాజీ మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్


