సరైన భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
చౌటుప్పల్ : సరైన భద్రతా చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో మంగళవారం లింగోజిగూడెంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో భద్రతపై ఒకరోజు శిక్షణ, అవగాహన సెమినార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న పలు పరిశ్రమల నుంచి సేఫ్టీ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతపై ఏమాత్రం రాజీపడొద్దన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతుందని తెలిపారు. సెమినార్ నిర్వహించిన దివీస్ పరిశ్రమను అభినందించారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ యాదాద్రి జిల్లా ఇన్‌స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సాంబశివరావు, సేఫ్టీ జనరల్ మేనేజర్ జి. బాలకిషోర్, బి. కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా
డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి


