గృహ ప్రవేశాలు త్వరగా చేపట్టాలి
యాదగిరిగుట్ట రూరల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని దాతర్‌పల్లి, రాళ్లజనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టి ఎన్ని రోజులవుతుంది, మెటీరియల్ ఏ రేటుకు తీసుకున్నారు, పూర్తయిన పనులకు బిల్లులు వచ్చాయా అనే వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి
కష్టపడి పనిచేయాలి
చౌటుప్పల్ : నూతనంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామాల అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం నల్లగొండకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు ఆయనను కలిసి మాట్లాడారు. వారిలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్కాపురం సర్పంచ్ గిర్కటి నిరంజన్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.
మంత్రి ఉత్తమ్‌కు వినతి
అడ్డగూడూరు: అడ్డగూడూరు పరిధిలోని ధర్మారం గ్రామం బిక్కేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంత్రి ఉత్తమకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ 64.23శాతం పూర్తి
భువనగిరిటౌన్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం 64.23 శాతం పూర్తయినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంగళవారం తెలిపారు. బూత్ స్థాయి అధికారులు 2025 ఓటరు జాబితాలోని 40 సంవత్సరాల వయస్సు గల ఓటర్లను, 2002 ఓటరు జాబితా తో గుర్తించి బీఎల్‌ఓ యాప్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అత్యధిక ఓటర్ల గుర్తింపు కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు.
పోచంపల్లి కళాశాలకు ఎక్స్‌లెన్స్ అవార్డు
భూదాన్‌పోచంపల్లి: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భూదాన్‌పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డు వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, హైబీజ్ టీవీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జెడీ లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యూనివర్సిటీ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి, జిల్లా ఇంటర్‌బోర్డు అధికారిణి రమణి అవార్డు అందుకున్నారు.
గృహ ప్రవేశాలు త్వరగా చేపట్టాలి
గృహ ప్రవేశాలు త్వరగా చేపట్టాలి


