కేసీఆర్ బయటకొచ్చారు
పార్టీ కనుమరుగవుతుందనే..
యాదగిరిగుట్ట : బీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగవుతుందనే.. కేసీఆర్ రెండేళ్ళ తరువాత బయటకు వచ్చాడని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. సింహం, పులి లేచిందని కేటీఆర్, హరీష్‌రావు మాట్లాడుతున్నారని, కానీ పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు యాదగిరిగుట్ట పట్ణంలో మంగళవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న అనంతరం మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల చర్చను చట్ట సభలో చర్చించేందుకు రానీ కేసీఆర్ ఇప్పుడు తన పార్టీని బతికించుకునేందుకు వచ్చాడని విమర్శించారు. ప్రజా పాలనలో రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అంతే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధిక స్థానాల్లో గెలిపించారన్నారు. గత పది సంవత్సరాల్లో పంచాయతీలకు నిధులు కేటాయించకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీతో మాకు పోటీ కాదని, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్‌కే పోటీ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్‌లంతా అభివృద్ధిలో ముందుకెళ్తు ప్రజలను అందరిని సమానంగా చూడాలన్నారు. కక్ష పూరిత రాజకీయాలు చేస్తే నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యతను ఇస్తు ప్రజలకు ప్రజాపాలన పథకాలను అందజేయాలన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా బీఆర్‌ఎస్ హయంలో సర్పంచ్‌లకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచ్‌లకు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, అర్హులైన వారందరికి ఇచ్చే బాధ్యత సర్పంచ్‌లదేనని అన్నారు. అంతకుముందు పట్టణంలోని వైకుంఠద్వారం నుంచి గుండ్లపల్లిలోని లక్ష్మీనరసింహ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదగిరీశుడి సేవలో మంత్రి అడ్లూరి
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకట్రావ్ మంత్రికి లడ్డూ ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు.
ఫ బీఆర్‌ఎస్ హయాంలో సర్పంచ్‌లకు
నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు
ఫ ప్రజాపాలనలో సర్పంచ్‌లకు
అంతా మంచే జరుగుతుంది
ఫ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


