ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
భువనగిరి, భువనగిరిటౌన్ : రీజినల్‌రింగ్ రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన మాట మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరికి ప్రియాంక గాంధీని తీసుకువచ్చి ఆమెతో.. అలైన్‌మెంట్‌ను మారుస్తామని హామీ ఇప్పించారని గుర్తుచేశారు. గుంట భూమి కూడా పోనివ్వమని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటారా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులతో కవిత సమావేశమయ్యారు. అదేవిధంగా బస్వాపురం, బండసోమారం గ్రామాల్లో పర్యటించారు. ఆమె వెంట జాగృతి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి తుంగతుర్తి సంతోష్‌రావు, తంగళ్లపల్లి శ్రీకాంత్, ఆకుల నరేష్, చిన్నం ప్రభాకర్, చక్రవర్తి, సంతోష్ ఉన్నారు.
ఎయిమ్స్‌లో మెరుగైన సేవలందించాలి
బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యరంగానికి బడ్జెట్ పెంచాలి
ఆలేరు: వైద్యరంగానికి బడ్జెట్ పెంచాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. అదేవిధంగా ఆలేరులో హజ్రత్ సయ్యద్ ఇస్మాయిల్ షా ఖాద్రీ ఆర్‌ఏ ఉర్సులో భాగంగా నిర్వహించిన గంధం ఊరేగింపులో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆలేరు పర్యటనలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులతో కలిసి పలు కళాశాలల విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం వారు ఆమెకు వినతి పత్రం అందజేశారు.
సామాజిక తెలంగాణ కోసం పోరాటం
మోటకొండూర్: సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం మోటకొండూర్‌లో ఆమె మాట్లాడారు. మండల కేంద్రంలో 950 సర్వే ప్రభుత్వ భూమిలో 30–40 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న 500 కుటుంబాలకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ నరేష్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివారెడ్డి ఉన్నారు.
ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి


