కనుల పండువగా ధనుర్మాసోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారంతో ఈ ఉత్సవాలు ఏడో రోజుకు చేరాయి. అమ్మవారి అలంకరణంగా విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు గోదాదేవి, శ్రీరంగనాథుడిని కొలుస్తూ, ఏడో పాశు రం పఠించి భక్తులకు వినిపించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి నీరాజనం పట్టారు.
శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలను అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిపించారు.వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు..గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ సహస్ర నామార్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రా కార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమంగజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర వేడుకలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
కనుల పండువగా ధనుర్మాసోత్సవాలు


