ఉప సర్పంచ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ..
రాజాపేట : మండలంలోని బొందుగుల ఉప సర్పంచ్‌ను మెజార్టీ వార్డు సభ్యులకు వ్యతిరేకంగా నియమించారని ఆరోపిస్తూ సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని పలువురు వార్డు సభ్యులు బహిష్కరించారు. ప్రత్యేకాధి కారి నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా.. ఉప సర్పంచ్‌తో చేయించొద్దని 9 మంది వార్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీ సులు వారిని నిలువరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ అనితను వివరణ కోరగా.. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించినట్లు తెలిపారు. 9మంది వార్డు సభ్యులు ప్రమాణస్వీకారానికి అంగీకరించలేదన్నారు.


