గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం రైల్వే సిబ్బంది గుర్తించారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి చేతిపై శ్రీఐ లవ్ యూ రాజ్, వెంకటేష్, లోకేష్‌శ్రీ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పేర్కొన్నారు. తెలుపు, నీలి రంగు నిలువు గీతల షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70189, 87126 70151 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


