యఖలాస్‌ఖాన్‌పేట తండాలో..
నడిగూడెం : మండలంలోని యఖలాస్‌ఖాన్‌పేట తండా రెండేళ్ల కిందట నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ధరావత్ వరలక్ష్మి ఎన్నికయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో టెంట్ కింద నిర్వహించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేయగా.. పనులు చేపట్టారు. సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


