జోగుళాంబ అమ్మవారికి పోచంపల్లి వస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి : అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారికి, శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవతామూర్తులకు శ్రీ పుండరీక భక్తసేవా సమాజం ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. వారం రోజుల పాటు నియమ నిష్టలతో మగ్గంపై తయారు చేసిన పట్టు వస్త్రాలు, సారేతో ఆదివారం శ్రీ పుండరీక భక్త సేవ సమాజం ధర్మకర్తలు ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో శ్రీ పుండరీక భక్త సేవా సమాజం అధ్యక్షుడు చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బిట్ల చంద్రశేఖర్, సభ్యులు ఆడెపు ఎల్లమ్మ, ఇంజమూరి జానకిరాములు, గర్థాస్ నర్సింహ, రచ్చ అంజయ్య, పాండాల మహేశ్వర్, యాదగిరి, సత్యనారాయణ, మధు, నర్సింహ, వనజ, సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, లలిత, సువర్ణ, జ్యోతి, గీత, వసంత, అన్నపూర్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


