బాపట్ల టు లక్ష్మాపురం
● పొట్టకూటి కోసం కూలీల రాక
రామన్నపేట : వలసలకు మారు పేరుగా నిలిచిన తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం అనేక ప్రాంతాలకు చెందిన కూలీల ఉపాధికి కేంద్రబిందువుగా మారింది. భవన నిర్మాణం, హమాలీ వంటి అనేక రంగాలలో పని చేసేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉపాధి నిమిత్తం తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. వ్యవసాయ పనుల సమయంలోనూ అనేక రాష్ట్రాలకు చెందిన వారు మన రాష్ట్రానికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఆదివారం ఏపీలోని బాపట్ల నుంచి కూలీలు రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి డీసీఎంలో వెళ్తూ మండలకేంద్రంలో అల్పాహారం నిమిత్తం ఆగడం సాక్షి కెమెరాకు చిక్కడం జరిగింది.


