జాతీయ కథల పోటీల్లో శ్రీవర్ధన్ ప్రతిభ
రామగిరి(నల్లగొండ): హైదరాబాద్‌కు చెందిన బాల చెలిమి సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి బాలల కథల పోటీలో నల్లగొండకు చెందిన సాగర్ల శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. ఈ కథల పోటీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి నుంచి 750 కథలు రాగా.. 16 కథలను ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అందులో శ్రీవర్ధన్ రాసిన కథ ఎంపికై ంది. రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, బాల చెలిమి సంస్థ అధ్యక్షుడు వేద కుమార్, బ్రెడ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ రావి శారద, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రఘు తదితరుల చేతుల మీదుగా శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. శ్రీవర్ధన్‌ను సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్, శ్రీవర్ధన్ తల్లిదండ్రులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, ధనలక్ష్మి తదితరులు అభినందించారు.


