పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురండి
భువనగిరి : జిల్లాలో వెలుగుచూడని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హ నుమంతరావు తెలిపారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లో 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించారు. ఎవరికి తెలియన పర్యాటక ప్రాంతం స్పష్టంగా కనిపించేలా ఫొటోలు, వీడియో, ప్రత్యేకతను వివరిస్తూ ఎంట్రీలను పంపాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కావాలి
రామన్నపేట : రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగుమతి చేసినంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు.


