తమ నేతకు ఉప సర్పంచ్ పదవి రాలేదని..
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. తన అభిమాన నేతకు ఉప సర్పంచ్ పదవి దక్కకపోవడంతో నిరాశకు గురైన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఎన్నిక శుక్రవారం నిర్వహించగా.. రాజకీయ సమీకరణాలు మారి కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యుడు మట్టిపల్లి శ్రీనుకు ఉప సర్పంచ్ పదవి దక్కలేదు. దీంతో శ్రీను అభిమాని మట్టిపల్లి రాజు తీవ్ర నిరాశకు గురై గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు గమనించి రాజును అడ్డుకున్నారు.
ఫ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం


