అటవీ వ్యవసాయం
గిరిజన
రైతులకు
వరం..
బొమ్మలరామారం : అటవీ వ్యవసాయం విస్తరించేందుకు గాను వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుడుగు వేస్తున్నారు. అడవిలోని చెట్లను నరకకుండా నేల సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పంటలు పండిస్తూ, పశుపోషణ చేస్తూ ఆదాయం పెంచుకోవడానికి అటవీ వ్యవసాయ పథకం దోహదం చేస్తుంది. ఈ పథకం 2022లో ప్రారంభం కాగా.. రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు గ్రామాలను ఎంపిక చేసి రైతులను అటవీ వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి–రాజేంద్రనగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బొమ్మలరామారం మండలంలోని యావపూర్ తండాతో పాటు జనగామ జిల్లాలో మరో గ్రామంలో ఈ అటవీ వ్యవసాయ పథకాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా టీ ఎస్టీ సబ్‌ప్లాన్, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఆయా గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అందజేస్తూ అటవీ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. 2026 సంవత్సరానికి గాను బొమ్మలరామారం మండలంలోని సోమాజిపల్లి, భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామాలు ఈ పథకానికి ఎంపికకానున్నట్లు సమాచారం.
యావపూర్ రైతులకు జరిగిన లబ్ధి..
యావపూర్ తండా గిరిజనులకు అటవీ వ్యవసాయంపై కల్పించిన అవగాహన మంచి ఫలితాన్నిచ్చింది. గ్రామంలోని ఎక్కువ మంది రైతులు సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా సాగు వైపు మళ్లారు. అటవీ వ్యవసాయంలో రైతులు లాభాలు పొందడానికి గాను ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా 15 మంది రైతులకు పూర్తి సబ్సిడీతో రూ.2.50లక్షల విలువైన బ్యాటరీ స్ప్రేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లు, టార్పాలిన్‌లు శ్రీగంధం, మామిడి, మలబారు, వేప, కుంకుడు, నీలగిరి, మహాగోని, అల్లనేరేడు, వెదురు, సీతాఫలం తదితర మొక్కలను అందజేశారు. మరో 21 మంది రైతులకు ఒకొక్కరికి 25 చొప్పున నాటుకోడి పిల్లలను అందించారు. సేంద్రియ వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాలు, పురుగు మందుల వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఇందిర గిరిజల వికాసం పథకం ద్వారా సబ్సిడీపై సోలార్ పంపులు, సోలార్ ప్యానల్స్ అందజేస్తుంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా 60 శాతం సబ్సిడీతో సోలార్ పంపులు అందజేస్తుంది. పశుగ్రాసం పెంచడానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుంది. 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు దోహదం చేస్తుంది.
ౖరెతులు సద్వినియోగం చేసుకోవాలి
– రామాంజనేయులు, ప్రధాన శాస్త్రవేత్త,
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
గిరిజనుల ఆర్థిక స్వావలంబన, సమతుల్య వాతావరణం సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. యావపూర్‌లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాం. 36 మంది రైతులకు పూర్తి సబ్సిడీతో బ్యాటరీ స్ప్రేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లు, టార్పాలిన్‌లు, 25 చొప్పున నాటుకోడి పిల్లలు, వివిధ రకాల మొక్కలు అందజేశాం. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఫ రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు, మొక్కలు,
నాటుకోడి పిల్లలు పంపిణీ
ఫ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
అటవీ వ్యవసాయం
అటవీ వ్యవసాయం


