మల్యాల, చీకటిమామిడిలో విషాదఛాయలు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని, ఆమె సమీప బంధువైన చీకటిమామిడి గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం స్కూటీపై వస్తుండగా.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కీసర సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పురాణి జోత్స్న(16) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం కళాశాల విద్యార్థులతో కలిసి హైదరాబాద్‌లోని వండర్‌లాకు విహారయాత్రకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో చీకటి కావడంతో కళాశాల నుంచి తనను మల్యాలకు తీసుకురావడానికి వరసకు బాబాయ్ అయ్యే చీకటిమామిడి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ(40)కు ఫోన్ చేసింది. కృష్ణ, జోత్స్న స్కూటీపై బొమ్మలరామారం వైపు వస్తుండగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో వీరి స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. జోత్స్న తండ్రి రాజు 13 ఏళ్ల క్రితం కెమికల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. జోత్స్న తల్లి మంజుల అదే ఫ్యాక్టరీలో స్వీపర్‌గా పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. జోత్స్న మృతితో మంజుల గుండెలవిసేలా రోదించింది. జోత్స్న సమీప బంధువు పపసుపుల కృష్ణ మేసీ్త్ర పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణకు భార్య మీనా, ఇద్దరు కుమార్తెలు(కవలలు), ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కృష్ణ కుటుంబం రోడ్డున పడింది.
అదుపుతప్పి కుంటలోకి దూసుకెళ్లిన ఆటో
ఫ ఒకరికి గాయాలు
డిండి : ఆటో అదుపుతప్పి నీటి కుంటలోకి దుసుకెళ్లిన ఘటన శుక్రవారం డిండి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం ప్రతాప్‌నగర్ గ్రామానికి చెందిన జర్పుల అనిల్ తన ఆటోలో చెర్కుపల్లి గ్రామ స్టేజీ వద్ద ఉన్న రైస్‌మిల్లు నుంచి బియ్యం లోడుతో బొగ్గులదొన గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆటో అదుపుతప్పి ఏనకుంటలోకి దూసుకెళ్లింది. దీంతో ఆటో నడుపుతున్న ప్రవీణ్ తలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రవీణ్‌ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఫ కీసర ఓఆర్‌ఆర్ వద్ద జరిగిన
రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన బంధువులు మృతి
మల్యాల, చీకటిమామిడిలో విషాదఛాయలు
మల్యాల, చీకటిమామిడిలో విషాదఛాయలు


