నాడు దేశ సేవలో.. నేడు ప్రజా సేవలో
డిండి: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిండి మండల పరిధిలోని గోనబోయనపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వర్కాల బాలనారాయణ ఆ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. సైన్యంలో 30 ఏళ్ల పాటు పనిచేసి ఎన్‌ఎస్‌జీ కమాండోగా పదవీ విరమణ పొందిన ఆయన తన సొంతూరికి సేవ చేసి అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా బరిలోకి దిగి 425 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అప్పడు సైనికుడు.. ఇప్పుడు పాలకుడు
ఆలేరురూరల్ : ఆలేరు మండలం పటేల్‌గూడెం
గ్రామానికి చెందిన గ్యార కుమారస్వామి 1992లో భారత సరిహద్దు దళం(బీఎస్‌ఎఫ్)లో సైనికుడిగా చేరి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. సైన్యంలో 21 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2013లో ఉద్యోగ విరమణ పొందాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పటేల్‌గూడెం సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో కుమారస్వామి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా విజయం సాధించారు.
డీసీఎం, కారు ఢీ..
యువకుడు మృతి
నకిరేకల్ : డీసీఎం, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన 565వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన శ్యామల మణికంఠ(24) కారులో పని నిమిత్తం నకిరేకల్‌కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులోకి రాగానే నల్లగొండ నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జయ్యింది. మృతుడి తల్లి శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.
కౌంటింగ్ కేంద్రంపై దాడి.. 18మంది బైండోవర్
గరిడేపల్లి : గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రంపై దాడి చేసిన ఘటనలో 18మందిని శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపారు. ఈ నెల 17న కౌంటింగ్ సమయంలో ఓడిపోయిన బీఆర్‌ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి కౌంటింగ్ హాల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కౌంటింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎడవెల్లి చంద్రారెడ్డి గాయపడ్డాడు. చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు 10మందిపై కేసు నమోదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన మరికొంత మందిని మొత్తం 18 మందిని శుక్రవారం హుజూర్‌నగర్ ఆర్డీఓ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నాడు దేశ సేవలో.. నేడు ప్రజా సేవలో
నాడు దేశ సేవలో.. నేడు ప్రజా సేవలో
నాడు దేశ సేవలో.. నేడు ప్రజా సేవలో


