ఫ్లైవుడ్ కంపెనీలో అగ్నిప్రమాదం
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ అగ్రి ఫ్లైవుడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మిషనరీ, ఫ్లైవుడ్ కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కంపెనీ లోపలి నుంచి మంటలు వస్తుండటంతో అక్కడే నివాసముంటున్న కూలీలు గమనించి యజమానికి విషయం చెప్పారు. అతను వెంటనే భువనగిరి ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేసి సమచారం ఇవ్వగా.. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్, చౌటుప్పల్ నుంచి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి 2గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 4 ఫైర్ ఇంజన్‌ల సహాయంతో మంటలార్పారు. ఈ ప్రమాదంలో మిషనరీ, ఫ్లైవుడ్, మెటీరియల్ అగ్రికి ఆహుతయ్యాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్‌రావు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కంపెనీలో అగ్నిప్రమాదాల నివారణకు ఉపయోగించే సేఫ్టీ సిలిండర్లు, పరికరాలు ఏమీ లేవు. అంతేకాకుండా అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి నష్టం వివరాలను చెప్పడానికి కంపెనీ యజమాని నిరాకరించాడు.
ఫ్లైవుడ్ కంపెనీలో అగ్నిప్రమాదం


