గుమాస్తా నుంచి సర్పంచ్‌గా..
నేరేడుచర్ల : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి సర్పంచ్‌గా గెలుపొందారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల మేజర్ గ్రామ పంచాయతీ బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బుర్రి శ్రీను బరిలోకి దిగి 459 ఓట్ల భారీ మోజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 12 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్‌ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. దిర్శించర్లలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందడం గమనార్హం.


