పంచాయతీ ముంగిట.. తీరొక్క ముచ్చట
పల్లె సంగ్రామం ముగింది. మూడు విడతల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చాలా గ్రామాల్లో ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. కొన్ని చోట్ల ఒకటి, రెండు ఓట్లతో
సర్పంచులుగా గెలుపొందారు. కొందరు తమ
బంధువులు, కుటుంబ సభ్యుల పైనే పోటీ చేసి గెలుపొందగా.. ఆటో డ్రైవర్, సుతారి మేస్త్రీగా
పనిచేసే వారు సైతం సర్పంచ్ బరిలో నిలిచి విజయం సాధించారు.
పోలైన ఓట్లు 318.. ఒక్క అభ్యర్థికే 312
మఠంపల్లి : మండలంలోని జామ్లాతండా గ్రామ పంచాయతీలో మొత్తం 371 ఓట్లు ఉండగా.. 318 ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా.. అనూహ్యంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బానోతు భాస్కర్‌నాయక్‌కు 312ఓట్లు వచ్చాయి. టీడీపీ బలపర్చిన నాగేశ్వరరావునాయక్‌కు 2 ఓట్లు, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి బాలాజీనాయక్‌కు 2 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అనితకు ఒక ఓటు రాగా.. మరొక ఓటు నోటాకు పడింది. దీంతో భాస్కర్‌నాయక్ మెజార్టీపై మండలంలో ప్రత్యేకంగా చర్చించుకున్నారు.
పంచాయతీ ముంగిట.. తీరొక్క ముచ్చట
పంచాయతీ ముంగిట.. తీరొక్క ముచ్చట
పంచాయతీ ముంగిట.. తీరొక్క ముచ్చట


