వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు రాష్ట్రస్థాయి గుర్తిం
తుర్కపల్లి : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పరిశుభ్రత ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ విద్యాలయ స్టార్ రేటింగ్ విధానం తెలంగాణలో ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా.. అందులో వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ కూడా ఉంది. ఆయా పాఠశాలల్లో తాగునీటి వసతి, బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, వాటి నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ, పరిశుభ్రతపై విద్యార్థులకు కల్పిస్తున్న అవగాహన, పాఠశాల పరిసరాల శుభ్రత వంటి 60 అంశాలపై ప్రత్యేక ఉపాధ్యాయ బృందం అధ్యయనం చేసి వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిచిన పాఠశాలలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయికి ఎంపికై తే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రూ.లక్ష నజరానా, అవార్డు అందజేస్తారని ప్రధానోపాధ్యాయుడు బంగారు సత్యం, ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
ఫ స్వచ్ఛ విద్యాలయ స్టార్ రేటింగ్‌లో
స్టేట్ లెవల్‌కు ఎంపిక


