మహబూబ్‌పేటలో గుజరాత్ బృందం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ) విభాగం, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రోగ్రాం అధికారులు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కోఆర్డినేటర్ సతీష్‌తో పాటు 30 మంది బృందం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో ఏయే పనులు చేయించారో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్యాటిల్ షెడ్, ఆయిల్‌పామ్ తోటలు, నీటి తొట్టెలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కూలీలకు ఇచ్చే జాబ్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సిస్టమ్ చాలా బాగుందని ప్రశంసించారు. వారి వెంట ఎంపీడీఓ నవీన్‌కుమార్, ఏపీఓ నర్సయ్య, ఈసీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏపీఎం వెంకటేష్, టీఏ వెంకటేష్, నూతన సర్పంచ్ ఆరె రమేష్, ఉప సర్పంచ్ సోకం అనిత, వార్డు సభ్యులు ఉన్నారు.
ఫ అభివృద్ధి పనుల పరిశీలన


