
పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
చౌటుప్పల్ రూరల్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షాంశ్ యాదవ్ కోరారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, పెద్దకొండూర్ చెరువుల వద్ద గణేష్ నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఎస్సై ఉపేందర్‌రెడ్డి, ఆర్‌ఐ బాణాల రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఉన్నారు.