
రావయ్యా.. గణపయ్య
ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నిర్వహకులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. జిల్లాలో సుమారు 5వేల వినాయక విగ్రహాలు కొలువుదీరనున్నాయి.
మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారుతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఏర్పాటు కానున్న సుమారు 5వేల వినాయక విగ్రహాల్లో సుమారు 2వేల వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
కిటకిటలాడిన కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఇప్పటికే భారీ గణనాథుడి విగ్రహాలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి గత నాలుగురోజుల నుంచి తమ ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరితో పాటు జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, యాదగిరిగట్టు, ఆలేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల కేంద్రాల వద్ద కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాలతో పాటు పూజా సామగ్రి, పండ్ల కొనుగోళ్లతో ఆయా కేంద్రాలు కిటకిటలాడాయి.
నేడు కొలువుదీరనున్న గణనాథులు
మండపాలను
సిద్ధం చేసిన నిర్వాహకులు
జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల
వినాయక విగ్రహాలు ఏర్పాటు
గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 7న గ్రహణం ఉన్నందున ఆలోపు నిమజ్జనాలు చేసుకుంటే బాగుంటుందని పండితులు సూచించారు. ఆమేరకు నిర్వహించేలా మండపాల నిర్వాహకులకు సూచనలు చేశాం. – రత్నపురం శ్రీశైలం,
భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు

రావయ్యా.. గణపయ్య