ముసాయిదా జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ముసాయిదా జాబితా విడుదల

Aug 29 2025 2:03 AM | Updated on Aug 29 2025 2:03 AM

ముసాయిదా జాబితా విడుదల

ముసాయిదా జాబితా విడుదల

మండలాల వారీగా ఓటర్లు

మండలం పురుషులు సీ్త్రలు మొత్తం

అడ్డగూడూరు 11,3,20 11,702 23,022

ఆలేరు 10,499 11,033 21,532

ఆత్మకూర్‌ 12,890 12,643 25,533

భువనగిరి 19,592 20,062 39,654

బీబీనగర్‌ 21,299 21,577 42,876

బి.రామారం 14,631 14,872 29,503

పోచంపల్లి 13,733 13,764 27,497

చౌటుప్పల్‌ 19,096 19,405 38,501

గుండాల 13,152 12,917 26,069

మొటకొండూరు 10,495 10,608 21,103

మోత్కూర్‌ 6,528 6,687 13,215

నారాయపురం 20,143 19,953 40,096

రాజాపేట 14,972 15,264 30,236

రామన్నపేట 22,684 22,674 45,358

తుర్కపల్లి 13,846 14,131 27,977

వలిగొండ 26,030 26,401 52,431

యాదగిరిగుట్ట 13,657 13,958 27,615

మొత్తం 2,64,567 2,67,649 5,32,218

మొత్తం ఓటర్లు 5,32,218 మంది

పోలింగ్‌ కేంద్రాలు 3,704

ఎంపీడీఓ, పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాల ప్రదర్శన

నేడు, రేపు అభ్యంతరాల స్వీకరణ

సాక్షి, యాదాద్రి: పరిషత్‌, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాలను పంచాయతీ అధికారులు గురువారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు జిల్లాలో నోటిఫై చేయబడిన 427 గ్రామ పంచాయతీల జాబితాలను వార్డుల వారీగా మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్‌ బోర్డులపై ప్రదర్శించారు. జాబితాలపై ఈనెల 30వ తేదీ వరకు రెండు రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కాగా శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఓటరు, పోలింగ్‌ ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాలు ఇలా.. ముసాయిదా ప్రకారం 427 గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు 3,704, ఓటర్లు 5,32,218 మంది ఉన్నారు. పురుషులు 2,64,567, మహిళలు 2,67,649 మంది ఉన్నారు.

అంతటా బీసీ రిజర్వేషన్లపైనే చర్చ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు పూర్తి చేయడం వంటి అంశాలు అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లుందన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్‌ పరిశీలనలో ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement