
ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల సాకారం
యాదగిరిగుట్ట: గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమన్నారు. పేదోళ్లు ఇళ్లు నిర్మించుకుంటే బీర్ల ఫౌండేషన్ నుంచి సాయం అందజేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అందజేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా ప్రజాప్రభుత్వం పథకాలను తీసుకువస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చైతన్యారెడ్డి, నాయకులు భిక్షపతిగౌడ్, గుండ్లపల్లి భరత్‌గౌ డ్, ముక్కెర్ల మల్లేశం, ఎరుకల హేమేందర్, శంకర్‌నాయక్, మహేందర్, నరేష్, హరీష్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య