
యూరియా కోసం రైతుల బారులు
ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు : ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండల కేంద్రాల్లోని సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. గురువారం ఉదయం ఆత్మకూర్ పీఏసీఎస్‌కు లారీ లోడ్, అడ్డగూడూరు సొసైటీకి 200 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం అందుకున్న రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీలకు తరలివచ్చి లైన్‌లో నిల్చున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం, రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కో రైతుకు 5నుంచి 10 బస్తాల యూరియా అవసరం ఉన్నప్పటికీ రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. వందలాది మంది రైతులు సాయంత్రం వరకు నిరీక్షించి నిరాశతో వెనుదిరిగారు. వ్యవసాయ పనులు వదులుకొని సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తుందని, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

యూరియా కోసం రైతుల బారులు