
ముంచెత్తిన వరద
న్యూస్‌రీల్
రెడ్ అలర్ట్..
26 రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం వరకు నమోదైన వర్షపాతం
మూసీకి పోటెత్తిన వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ, బిక్కేరు వాగుల ద్వారా మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది.
- 8లో
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025
- 9లో
బోధనలు ఆచరణీయం
ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయమని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ శివనాగిరెడ్డి అన్నారు.
- 8లో
నాగిరెడ్డిపల్లి వద్ద 24 గంటలు నిలిచిన రాకపోకలు
ఈనెల 26వ తేదీ రాత్రి నుంచి 27 వరకు ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల భువనగిరి–నల్లగొండ మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. దీంతో పోలీసులు సుమారు 24 గంటల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు త్రీవ ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని వాహనాలను నాగిరెడ్డిపల్లి, ఎర్రంబెల్లి, గౌస్‌నగర్, తుక్కాపురం మీదుగా రాకపోకలకు అవకాశం కల్పించారు. తిరిగి గురువారం ఉదయం 11 గంటల సమయంలో భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే భువనగిరి మండలంలోని అనాజీపురం–బీబీనగర్ మండలంల రావిపహాడ్ గ్రామాల మధ్య చిన్నేటి వాగు ప్రవహించడంతో రాకపోకలునిలిచిపోయాయి. బొల్లేపల్లి గ్రామం మధ్య నుంచి వెళ్లే చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సాక్షి,యాదాద్రి : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భువనగిరిలోని జంఖానగూడెంలోఇళ్ల మధ్యకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాన్ ఆయకట్టులో చెరువులు అలుగుపోస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద చేరడంతో చెరువులను తలపించాయి.
భువనగిరి నియోజకవర్గంలో..
భువనగిరి మండలం అనాజిపురం–బీబీనగర్ మండలం రావిపహాడ్ ఽమధ్య చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
బీబీనగర్, భువనగిరి పెద్ద చెరువులు, తీనం చెరువు జలకళను సంతరించుకున్నాయి. బీబీనగర్ వద్ద సర్వీస్ రోడ్డు వెంట చిన్నేటి వాగు వరద ప్రవాహానికి రాకపోకలు నిలిపివేశారు.
బీబీనగర్ మండలం అన్నంపట్ల–గూడూరు మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
మూసీ బ్రిడ్జిలు సంగెం, రుద్రవెల్లి వద్ద బుధవా రం రాకపోకలను నిలిపివేశారు. తిరిగి గురువారం పునరుద్ధరించారు.
ఆలేరు నియోజకవర్గ పరిధిలో..
యాదగిరిగుట్ట పట్టణంలో గండి చెరువు అలుగుపోస్తోంది.అధికారులు చెరువు గేట్లు ఎత్తి యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ పక్క నుంచి వంగపల్లి వాగులోకి నీటిని పంపుతున్నారు.
వర్షం కారణంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది.
గుండ్లపల్లిలో తోపుగాని చెరువు అలుగుపోస్తుంది.
యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం కుంగిపోయింది.
యాదగిరిగుట్ట నుంచి రాజాపేటకు వెళ్లే మార్గంలోని సైదాపురం వాగు, చొల్లెరు–మర్రిగూడెం మధ్యలో వాగులు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
దాతారుపల్లిలో చెరువుకట్టపై గండి ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమై పూడ్చివేశారు.
ఆలేరు పట్టణ పరిధిలోని పెద్ద వాగు జలకళను సంతరించుకుంది.
రాజాపేట మండలం కాల్వపల్లి–పొట్టిమర్రి వద్ద వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేసి, రఘునాథపురం–వెంకటపురం మధ్య మార్గం నుంచి వాహనాలను మళ్లించారు.
రాజాపేట మండల పరిధిలో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.
తుర్కపల్లి మండలం గంథమల్ల చెరువు నిండి మత్తడి దుంకుతుంది.
ఆలేరు మండలం కొలనుపాక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలేరు నుంచి బచ్చన్నపేట, సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
ఆలేరు నుంచి జనగాం మీదుగా వాహనాలు సిద్ధిపేట వైపు వెళ్తున్నాయి.
బొమ్మలరామారం మండలం చౌదరిపల్లి మల్లారెడ్డి చెరువు అలుగుపోస్తుండటంతో మర్యాల గ్రామంలో కల్వర్టు ప్రాంతమంతా కోతకు గురైంది. దీంతో అక్కడి నుంచి పలు గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయి గురువారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం
ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఫ భువనగిరి–చిట్యాల మార్గంలో రోజంతానిలిచిన రాకపోకలు, పునరుద్ధరణ
ఫ నాన్ ఆయకట్టులోనూ అలుగుపోస్తున్నచెరువులు
జిల్లాలో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులువర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లో లెవల్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసింది.
26వ తేదీ రాత్రి నుంచి 27 ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 66.3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అధికంగా భువనగిరిలో 19 సెం.మీ, యాదగిరిగుట్టలో 13 సెం.మీ, తుర్కపల్లిలో 9 సెం.మీ, వలిగొండలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. 27నుంచి 28వ తేదీ ఉదయం వరకు 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజాపేటలో 8 సెం.మీ, తుర్కపల్లి 5 సెం.మీ, ఆలేరు 5 సెం.మీ, భువనగిరిలో 4 సెం.మీ వర్షం కురిసింది.

ముంచెత్తిన వరద

ముంచెత్తిన వరద