
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు.వేకుజామును సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తరం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
శివాలయంలో గణపతి పూజ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించిన వినాయకులకు గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉప ఆలయ మండపంలోని వినాయకుడితో పాటు మట్టి గణపతికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చకులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు