
కిక్కిరిసిన ఎయిమ్స్
బీబీనగర్: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మంగళవారం రద్దీ ఏర్పడింది. ఓపీ విభాగం వద్ద జనం పెద్దఎత్తున బారులుదీరారు. ఎయిమ్స్‌లోని వైద్య విభాగాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రోజుకు 2000లకు పైగా ఓపీ ద్వారా ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. కానీ ఓపీ కౌంటర్లు 10మాత్రమే ఉన్నాయి. రోగులకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్య లేకపోవడంతో ఓపీ కార్డు పొందేందుకు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.