ఖిలా పనుల్లో కదలిక.. | - | Sakshi
Sakshi News home page

ఖిలా పనుల్లో కదలిక..

Aug 26 2025 7:13 AM | Updated on Aug 26 2025 7:13 AM

ఖిలా

ఖిలా పనుల్లో కదలిక..

పనులు దక్కించుకున్న కంపెనీలు

తొలిదశకు టెండర్లు పూర్తి

రెండు ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులు ఇవీ..

మంత్రి పర్యటన వాయిదా

భువనగిరి: చారిత్రక భువనగిరి కోట అభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయి. తొలిదశ పనులను రెండు ప్యాకేజీల్లో చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. రోప్‌వే పనులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏజెన్సీ, సివిల్స్‌ వర్స్‌ను హైదరాబాద్‌ కంపెనీ దక్కించుకున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఖిలాపైకి రోప్‌వే ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేశారు. పర్యాటక శాఖ అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులు ఇటీవల ఖిలాను సందర్శించి అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించారు.

రూ.100 కోట్లతో నాలుగు దశల్లో..

స్వదేశీ దర్శన్‌ 2.0 పథకం కింద ఎంపికై న భువనగిరి ఖిలాను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం నాలుగు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.56.81 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ఖిలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ పలుమార్లు భువనగిరి కోటను సందర్శించి అధ్యయనం చేసి డీపీఆర్‌ రూపొందించి ఫైనల్‌ చేసింది. దీని ఆధారంగా తొలి విడత పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.

ఇందులో రోప్‌వే పనులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏజెన్సీ రూ.18 కోట్లకు దక్చించుకోగా.. సివిల్‌ పనులను హైదరాబాద్‌ ఏజెన్సీ రూ.30 కోట్లకు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఈనెల 18న పర్యాటక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అగ్రిమెంట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

ఫ రెండు ప్యాకేజీలుగా పనులు

ఫ రోప్‌వే టెండర్‌ దక్కించుకున్న పశ్చిమ బెంగాల్‌ ఏజెన్సీ

ఫ సివిల్‌ వర్క్స్‌ హైదరాబాద్‌ కంపెనీకి

ఫ రోప్‌వే బేస్‌ క్యాంప్‌ వద్ద పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు

రోప్‌ వే : ఖిలా నుంచి బైపాస్‌ సమీపంలోని రోవ్‌వే బేస్‌ క్యాంప్‌ వరకు రెండు కేబుల్‌ కార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రెండు సిమెంట్‌ పిల్లర్లు నిర్మించి రోప్‌వే ద్వారా రావడం, వెళ్లండం కోసం తీగ మార్గం ఏర్పాటు చేస్తారు. రోప్‌వే బేస్‌ క్యాంప్‌, చివరి ప్రాంతంతో పర్యాటకుల కోసం గ్రీనరీ, విశ్రాంతి ప్రదేశాలతో పాటు వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.

సివిల్‌ వర్క్స్‌: కోట ఎంట్రీ వద్ద చారిత్రక కట్టడాల శైలిలో ప్రవేశ ద్వారం నిర్మించనన్నారు. అలాగే క్యాంటీన్‌, గ్రీనరీ, పార్కింగ్‌, గోడ, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. వీటితో పాటు కోట పైభాగంలో రాణిమహాల్‌ భవనాన్ని ఆధునీకరించి కొత్త రూపు తీసుకురానున్నారు. అవసరమైన చోట మెట్లు, రెయిలింగ్‌, తాగునీటి సౌకర్యం, మూత్ర శాలలు ఏర్పాటు చేస్తారు. ఖిలా ప్రవేశ ద్వారం నుంచి రోవ్‌వే బేస్‌ క్యాంప్‌వరకు సీసీ రోడ్డు నిర్మిస్తారు.

టెండర్లు పూర్తి కావడంతో ఖిలా అభివృద్ధి పనులను ప్రారంభించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే రోవ్‌ వే బేస్‌ క్యాంప్‌ వద్ద ప్రదేశాలను చదును చేశారు. రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం ఖిలాను సందర్శించి పనులు చేపట్టే ప్రాంతాలను పరిశీలించాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడింది. త్వరలో తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

ఖిలా పనుల్లో కదలిక..1
1/1

ఖిలా పనుల్లో కదలిక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement