
‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు
ఫ జీవశాస్త్రం టీచర్ పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఫ రాష్ట్రం నుంచి ఈమె ఒక్కరే ఎంపిక ఫ హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు
సూర్యాపేటటౌన్ : పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయికి ఆరుగురు దరఖాస్తు చేసుకోగా సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రకు ఒక్కరికే ఈ అవార్డు రావడం పట్ల పలువురు సైన్స్ టీచర్లు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 45 మంది ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో పెన్‌పహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారం పవిత్ర ఎంపిక కావడం విశేషం.
ఎగ్జిబిట్‌తో విద్యార్థినులు, టీచర్ పవిత్ర