
అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం
గంధమల్లకు రూ.358 కోట్లు
రాచకొండ పోలీస్ ఆదర్శం
టెన్త్ ఫలితాల్లో మెరుగైన స్థానం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు నీరు
అందించడమే లక్ష్యం. గంధమల్ల రిజర్వాయర్ భూ సేకరణ దాదాపు పూర్తయ్యింది. మూసీ కాలువల ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
–గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్
సాక్షి, యాదాద్రి: ‘ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. సమన్వయంతో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం. అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం’ అని శాసనమండలి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రగతి కార్యక్రమాలను వివరించారు.
ప్రసంగంలోని ప్రధానాంశాలు
● జిల్లాకు 9,398 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,542 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.47 కోట్లు జమ చేశాం.
● కొత్తగా 23,367 రేషన్‌కార్డులు మంజూరు చేశాం. వీటి ద్వారా 71,530 మందికి లబ్ధి చేకూరుతుంది.
● రుణమాఫీ పథకం కింద 2,33,418 మంది రైతులకు రూ.306.47 కోట్లు మాఫీ జరిగింది. 2024–25 యాసంగి సీజన్‌లో 375 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,128 మంది రైతుల నుంచి 3,74, 728 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.865 కోట్లు చెల్లించాం.
● 23,921 ఎకరాల్లో ఉద్యాన, మల్బరీ తోటలు సాగవుతున్నాయి. గత మూడేళ్లలో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు సాగైంది. ఈ ఏడాది 3,500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించాం.
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 1,200 సమస్యలను పరిష్కరించాలి.
● ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను మంజూరు చేసింది.
● జాతీయ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా 1,084 మందికి రూ.2.16 కోట్ల ఆర్థిక సాయం అందించాం
● 2025–26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహా యక సంఘాలకు రూ.611.17 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించాం. ఇప్పటి వరకు రూ.189.52 కోట్లు మంజూరు చేశాం.
● 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు గాను ‘నేతన్నకు పొదుపు’ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 10,790 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు నమో దు కాగా రూ. 2.17 కోట్లు విడుదల చేశాం.
● తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన ఇద్దరు, వైకల్యం పొందిన నలుగురు గీత కార్మికులకు రూ.10.40 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశాం.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతారం జెడ్పీహెచ్‌ఎస్, భువనగిరిలోని కృష్ణవేణి హైస్కూల్, బాలికల హైస్కూల్, విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అదే విధంగా ఉత్తమ సేవలందించి 162 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. 2,379 స్వయం సహాయక సంఘాలకు రూ.210 కోట్ల బ్యాంకు రుణాలకు సంబంధించి చెక్కులు అందజేశారు.
స్టాళ్ల ప్రదర్శన
ఉద్యానవన, రోడ్లు భవనాలు, మహిళాశిశు సంక్షేమం, ఎస్సీ, మైనార్టీ సంక్షేమం, నీటిపారుదల, సహకార, మత్స్యశాఖ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, గ్రామీణా భివృద్ధి, మెప్మా, విద్య తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వీరారెడ్డి శాసనమండలి చైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఏఎస్పీ రాహుల్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు .
నృత్యం చేస్తున్న విద్యార్థినులు
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. అందులో భాగంగా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన చేశారు. 1.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించను న్నారు.ఇందుకోసం ప్రభుత్వం రూ.358.16 కోట్ల మంజూరు చేసింది. ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. దీంతో పాటు బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాం. పనులు పురోగతిలో ఉన్నాయి.
నేరాల నియంత్రణ, కేసుల చేదనలో రాచకొండ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచారు. నేరాల నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సాంఘిక దురాచారాలపై కళాకారులతో సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫ అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
ఫ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
ఫ స్వాతంత్య్ర వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
గత విద్యా సంవత్సరం మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 159 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 97.8 ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 5,800 మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గొప్ప విషయం.

అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం

అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం

అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం

అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం

అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం