
సమన్వయంతోనే ప్రగతిపథం : కలెక్టర్
సాక్షి యాదాద్రి : కలెక్టరేట్‌లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పథకాల అమలులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వాలు ఏ స్ఫూర్తితో పథకాలు తెస్తున్నాయో, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలుచేసి, ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందేలా కృషి చేయాలని కోరారు. సమన్వయంతో జిల్లాను ప్రగతిపథంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈఓ వెంకట్రావ్ జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ, దేవస్థానం అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

సమన్వయంతోనే ప్రగతిపథం : కలెక్టర్