
ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకల్లో కోదాడ విద్యార్థులు
కోదాడరూరల్ : ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో గల తేజ విద్యాలయానికి చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా భారత రక్షణశాఖ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో 2లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 200మంది విద్యార్థులకు ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. వారిలో కోదాడ తేజ విద్యాలయం విద్యార్థులు 15 మంది ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు.
గోల్కొండ కోటలో మోగిన సతీష్ డప్పు దరువు
గరిడేపల్లి: గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మ్యూజిక్ అకాడమీ డప్పు కళా బృందం, మహిళా డప్పు కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర డైరెక్టర్ మామిడి హరికృష్ణ సహకారం, అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో గోల్కొండ కోటలో డప్పుల దరువు ప్రదర్శనలో పాల్గొన్నట్లు మాస్టర్ అమరవరపు సతీష్ తెలిపారు. వేడుకల్లో కల్పన, స్వరూప, భువన, అపర్ణ, నాగమణి, వీరబాబు, శోభన్, గంగ, వెంకటమ్మ, కుమారి, సంజయ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకల్లో కోదాడ విద్యార్థులు