
ఆలేరు అభివృద్ధి ఘనత బీఆర్‌ఎస్‌దే
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని, కేసీఆర్ దీవెనలతో అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించానని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్‌ఎస్ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ క్యామ మల్లేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని యువ జన, విద్యార్థి విభాగం, బీఆర్ ఎస్ కార్యకర్తలను కోరారు. ఆలేరు ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని, తుది శ్వాసవరకు వారికి అండగా నిలుస్తానన్నారు. ప్రజలు దీవిస్తే మరోసారి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలి పారు. రాష్ట్ర ప్రజలంతా మరో మారు కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ కార్యదర్శి జనరల్ పాపట్ల నరహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నాయకులు బీసు కృష్ణంరాజు, బైరోజు వెంకటచారి, మారెడ్డి కొండల్‌రెడ్డి, వస్పరి శంకరయ్య, పల్లా వెంకట్‌రెడ్డి, తోటకూరి బీరయ్య, జి.బాబురావు, శిఖ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు అభివృద్ధి ఘనత బీఆర్‌ఎస్‌దే