
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడు కొలువైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యానం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాడవీధుల్లో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
అలరించిన నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అకట్టుకున్నాయి. రమేష్‌రాజ్ డాన్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్యం చేసి అలరించారు. వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మినీ శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. చెరువులో బోటు పై షికారు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బాలికలు సింధుప్రియ, భావనరెడ్డి, వందనరెడ్డి, పావని, సింధు, బింధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోదీ మౌనం వీడాలి
రామన్నపేట: భారత్‌పై అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించడంతో ప్రధామంత్రి మోదీ విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి జయంతిని పురస్కరించుకుని శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అనేక ఆంక్షలు, వాణిజ్య సుంకాలు విధిస్తున్నా మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్న అమెరికా వైఖరిపై భారత్ మౌనం వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, నాయకులు జెల్లెల పెటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, అవ్వారి గోవర్దన్, కూరెళ్ల నర్సింహాచారి, కందుల హన్మంత్, గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, గొరిగె సోములు, లెనిన్ శ్రీకృష్ణ, సత్యం, నరేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు