
కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా అడుతున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చాడని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూసుకుంట్ల మాట్లాడారు. ‘ప్రభుత్వం సహకరిస్త లేదని అంటున్నావు.. మీ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఒక్కసారైనా మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చావా’ అన్ని ప్రశ్నించారు. మునుగోడుకు నేనే మంత్రి.. నేనే రాజుగా రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదన్నారు. ‘ఎల్‌బీనగర్ నుంచి పోటీచేస్తే మంత్రి పదవి వచ్చేదని అంటున్నావు.. మునుగోడుపై ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు. మంత్రి పదవి స్టేజీల మీద మాట్లాడితే రాదు.. అధిష్టానంతో మాట్లాడితే వస్తుంది’ అని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వల్ల మునుగోడు నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావో.. ఇంకేం చేస్తావో కానీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. సుశీలమ్మ ఫౌండేషన్‌కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, తాను ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. నిఝెజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలే కనిపిస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన వెంట నారాయణపురం మండల బీఆర్‌ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు నర్రి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజగోపాల్‌రెడ్డికి
మంత్రిపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదు
ఫ మునుగోడుకు మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదు
ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి