
త్రివర్ణ పతాక అలంకరణలో సాయినాథుడు
చింతపల్లి: మండల కేంద్రంలోని షిర్డీ సాయినాథుడి దేవాలయంలో శుక్రవారం లక్ష గాజుల పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు లక్ష గాజుల పూజా కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు వేరే సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రేణుక రాజేశ్వరి పీఠాధిపతి మేలురి నవీన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే త్రివర్ణ పతాకంతో సాయినాథుడికి ప్రత్యేక అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచిగంటి ధనంజయ, ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకటయ్య, కోశాధికారి ఊరే కృష్ణయ్య, కుంభం పుల్లారెడ్డి, క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బుద్ధవనం సిబ్బందికి ప్రశంసా పత్రాలు
నాగార్జునసాగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బుద్ధవనం సిబ్బందికి ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు బుద్ధవనంలోని మహాస్థూపం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. 20ఏళ్లుగా బుద్ధవనంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించే విధంగా ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ నాజీష్ తదితరులు పాల్గొన్నారు.

త్రివర్ణ పతాక అలంకరణలో సాయినాథుడు